BREAKING
తెలుగబ్బాయిని పెళ్లి చేసుకుంటానా? స్పందించిన ది రాజాసాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ మోసాలకు కేంద్రం చెక్ :కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడి! నకరికల్లులో వైసీపీ కార్యకర్తలకు ఐడి కార్డులు పంపిణీ ఆర్టీసీ ఎన్నికల్లో దూసుకుపోయిన బాణం నారాయణపేట డిపోలో కూటమికి మెజార్టీ రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జీర్ణక్రియ సజావుగా సాగేలా పాటించాల్సిన ఆరోగ్యకరమైన చిట్కాలు హోప్ శతకం, రూథర్‌ఫోర్డ్ విధ్వంసం – 249 పరుగులు చేసినా భారత్‌కు తప్పని ఓటమి మానసిక ప్రశాంతత కోసం రోజువారీ జీవితంలో పాటించాల్సిన సులువైన మార్పులు ఇవే నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పేదలకు విద్యా, వైద్య సాయం వెలకట్టలేనిది -- ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి

Select Suryaa Now
పేదలకు విద్యా, వైద్య సాయం వెలకట్టలేనిది  -- ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి

ఏలూరు, సూర్య న్యూస్ :విద్య, వైద్యం విషయాల్లో పేదలకు, అవసరార్థులకు అందించే సాయం వెలకట్టలేనిదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. తద్వారా వచ్చే ఆత్మ సంతృప్తే వేరంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం నిరాటంకంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ వారం కూడా శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో విచ్చేసిన వారికి వైద్యులు, సిబ్బంది అవసరమైన వైద్య పరీక్షలు, రక్త పరీక్షలను నిర్వహించారు. అలాగే అవసరార్థులకు ఉచితంగా మందులను అందించారు. ఈ సందర్భంగా శిబిరం కొనసాగుతోన్న తీరును జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. శిబిరానికి విచ్చేసిన వారితో మాట్లాడి,,, వారి అనారోగ్య సమస్యలను తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు, సూచనలు అందించాలని సూచించారు. అనంతరం అవసరార్థులకు ఎమ్మెల్యే బడేటి చంటి మందులను పంపిణీ చేసి, వారిలో ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. ఒకపక్క ఎన్టీఆర్‌ వైద్య సేవతో పాటూ మరోపక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీతో అనారోగ్యవంతులైన పేదలకు ఆర్ధిక భరోసా కల్పిస్తున్నామని వెల్లడించారు. దీనికి అదనంగా ఏలూరు నియోజకవర్గంలో ఉచిత వైద్య సేవలు కొనసాగాలనే ఉన్నతాశయంతో తన ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ వస్తోన్న విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, ఈ సేవలను అవసరార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదేసమయంలో శిబిరాన్ని సందర్శించిన బీజేపి జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్‌ కిషోర్‌ మాట్లాడుతూ బడేటి కుటుంబం అంటేనే భరోసా అనే నమ్మకాన్ని శాశ్వతం చేసేలా విశేషంగా కృషిచేస్తోన్న ఎమ్మెల్యే బడేటి చంటి సేవలు అభినందనీయమని ప్రశంసించారు. వైద్య శిబిరం ద్వారా ఉచిత సేవలను పేదలకు మరింత చేరువ చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఏపి మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, జిల్లా తెలుగుదేశం పార్టీ మిడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బెల్లపుకొండ కిషోర్‌, పలువురు మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జీలు తదితరులు పాల్గొన్నారు.

 న్యూస్ బ్యూరో కే బాలసౌరి ఏలూరు