BREAKING
యువతే దేశ భవిష్యత్తును కాపాడాలి నిజాంపేటలోని భవ్యస్ శ్రీ సూర్య అపార్ట్మెంట్లో బతుకమ్మ పండుగ కొలహలం గా చోడవరం కోదండ రామాలయానికి రఘు రూ. 50 వేల ఆర్థిక సాయం కోడి కూత వినిపించని గ్రామం.. కోడిగుడ్డు కోడి మాంసం తినని గ్రామం. రైతుబజారుకు ఆదరణ ఏదీ? రాష్ట్రస్థాయి వేదికపై చిన్నకోడూరు బైండ్ల కళాకారుల ప్రతిభ పూల సోయగాలతో పల్లెల్లో బతుకమ్మ సందడి! స్థానిక ఎన్నికలు పగడ్బందీగా నిర్వహించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు అంబటి మురళీకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన వట్టిప్రోలు రంగారావు పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత దిశగా అడుగులు - దసరా సెలవుల నేపథ్యంలో జిల్లాలోని సముద్రతీరాలకు వచ్చే పర్యాటకుల భద్రతకు పటిష్ట చర్యలు ఉచిత వైద్య శిబిరాల ఏర్పాటు అభినందనీయం అద్దంకి రాజీవ్ కాలనీలో పోలీసుల 'కార్డన్ సెర్చ్'.. కలపను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు పాకల బీచ్‌లో పెను విషాదం.. సముద్ర అలలకు ఇద్దరు బలి!

పేదల ఆకలి తీర్చడమే మానవ జన్మకు సార్థకత

Select Suryaa Now
పేదల ఆకలి తీర్చడమే మానవ జన్మకు సార్థకత

బాడంగి, సూర్య : ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే మించిన సేవ మరొకటి లేదని, పేదలు, వృద్ధుల ఆకలి తీర్చినప్పుడే మానవ జన్మకు నిజమైన సార్థకత లభిస్తుందని టీడీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీ, ఏపీ ఎరుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు, బాడంగి మాజీ వైస్ ఎంపీపీ పాలవలస గౌరు అన్నారు.
బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామంలో అన్నపూర్ణ ఆపన్న హస్తం నిర్వాహకుల ఆధ్వర్యంలో వృద్ధులు, నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి అయ్యే పూర్తి ఖర్చును బాడంగి మండలం ఎరుకులపాకలు గ్రామానికి చెందిన పాలవలస గౌరు ఆర్థిక సహకారంగా అందించారు. పేదలు, వృద్ధులకు కడుపునిండా భోజనం అందించాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చారు.
సేవకు సంపద కాదు.. మంచి మనసే ముఖ్యం!
తన వద్దకు సహాయం కోసం వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపకూడదనే సంకల్పంతో పాలవలస గౌరు తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. వ్యక్తిగతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా తన పరిధిలో సహకరించేందుకు ముందుంటున్నారు. బాడంగి మండలానికే పరిమితం కాకుండా ఇతర మండలాల్లోని గ్రామాల ప్రజలకు సైతం తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎరుకులపాకలు గ్రామంలో దేవాలయాల నిర్మాణం, నిర్వహణతో పాటు పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వాములవుతున్నారు.
పది రూపాయల్లో తొమ్మిది రూపాయలు పేదల కోసమే!
ఈ సందర్భంగా పాలవలస గౌరు మాట్లాడుతూ, “అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది. భగవంతుడు ప్రసాదించిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే మన కడుపు నిండితే సరిపోదు. మన చుట్టూ ఉన్నవారి కడుపులు కూడా నిండాలి. అందరూ బాగుండాలి.. అందులో మనమూ ఉండాలి అనే భావనతో ముందుకు సాగినప్పుడే జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది.
నేను పుట్టినప్పుడు చెట్టు నీడలో పుట్టాను. భగవంతుడి కృపతో పాటు, నా రాజకీయ గురువు స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే తెంటు జయప్రకాష్ అడుగుజాడల్లో నడుస్తూ, ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాను. నాకు లభించిన దానిలో ఎక్కువ భాగం పేదలకు అందించాలన్నదే నా ఆలోచన. నా దగ్గర పది రూపాయలు ఉంటే అందులో తొమ్మిది రూపాయలు పేదల కోసం ఖర్చు చేస్తాను. మిగిలిన రూపాయితో నా కుటుంబాన్ని పోషించుకుంటాను. సంపాదన ఎంత ఉందన్నది కాదు.. మన వల్ల ఎంతమందికి మేలు జరుగుతోందన్నదే ముఖ్యం” అని పేర్కొన్నారు.
నిస్వార్థ సేవే నిజమైన సంపద
ఆర్థికంగా వెనుకబడినవారికి, ఆపన్నులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పాలవలస గౌరు తన సేవా కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నారు. పేదలు, వృద్ధుల ఆకలి తీర్చేందుకు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించడం ద్వారా సామాజిక సేవ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకున్నారు. ఆయన అందిస్తున్న సహాయ సహకారాలపై పలువురు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.

రిపోర్టర్ : శ్రీనివాస రావు, బాడంగి, విజయనగరం జిల్లా.