పెదకూరపాడు జెడ్పీటీసీ అభ్యర్థిగా నల్లపాటి కీర్తన నామినేషన్
నరసరావుపేట :పెదకూరపాడు మండల జెడ్పీటీసీ టీడీపీ అభ్యర్థిగా నల్లపాటి కీర్తన నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో కీర్తన తండ్రి నల్లపాటి రామచంద్ర ప్రసాద్‌తో పాటు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, పెదకూర పాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, నరసరావు పేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగొంట్ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లపాటి కీర్తన మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలు, పెద్దల ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుకు సాగాలని సంకల్పించినట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. యువతకు అవకాశాలు, మహిళల అభ్యున్నతి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి, అండగా నిలిచిన ప్రజాప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలకు కృత జ్ఞతలు తెలిపారు. పెదకూరపాడు మండల సమగ్రాభివృద్ధే తన ధ్యేయమని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కీర్తన పేర్కొన్నారు.
మల్లికార్జున రావు పల్నాడు జిల్లా ఇన్చార్జి..