BREAKING
ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు...ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ : గుజరాత్ అంబాజీ ఆలయ మోహన్‌థాల్ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్): పవిత్ర నైవేద్యానికి దక్కిన విశిష్ట గౌరవం!

పసిడి మాఫియా గుట్టువిప్పిన "డిఆర్ఐ"

Select Suryaa Now
పసిడి మాఫియా గుట్టువిప్పిన "డిఆర్ఐ"

★విశాఖ జాతీయ రహదారిపై సినిమా ఛేజింగ్
★కారు రహస్య లాకర్ లో కిలోల కొలది బంగారం
★9 కోట్ల విలువైన విదేశీ బంగారం పట్టుకున్న డిఆర్ఐ
★5.83 కిలోల 24 క్యారెట్ల బంగారం స్వాధీనం
★కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో అక్రమ రవాణా
★ఇద్దరు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు

విశాఖపట్నం,  మేజర్ న్యూస్ : విశాఖ జాతీయ రహదారిపై సినీ ఫక్కీలో జరిగిన హైస్పీడ్ ఛేజింగ్‌లో అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ ముఠా ను డైరెక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ పట్టుకుంది.వీరి అక్రమ విదేశీ బంగారం మాఫియా గుట్టు ను బట్టబయలు చేసింది. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా కారులో తరలిస్తున్న విదేశీ బంగారం సుమారు రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల విదేశీ బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డీఆర్‌ఐ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దర నిందితులను డిఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు.ప్రక్క సమాచారంతో  నిఘా పెట్టిన డీఆర్‌ఐ అధికారులు,కారును వెంబడించి విశాఖ జాతీయ రహదారిపై వద్ద అడ్డుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని డిఆర్ఐ అధికారులు విచారించడంతో పాటు  కారు ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ క్రమంలో ముందు సీటులో సహ ప్రయాణికుడి కాళ్లు పెట్టుకునే స్థలం కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య లాకర్ ను గుర్తించారు.అందులో మూడు ప్యాకెట్లలో దాచిన  విదేశీ బంగారం ఉన్నట్లు గుర్తించారు. . 24 క్యారెట్లకు చెందిన 999 స్వచ్ఛత కలిగిన ఈ బంగారం మార్కెట్‌ విలువ రూ.8.98 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.దీనితో నిందితులను అదుపులోకి తీసుకొని మరెంత లోతుగా విచారణ చేపట్టారు. భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దు మీదుగా అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కస్టమ్స్‌ చట్టం-1962 ప్రకారం అధికారులు బంగారం, కారు సీజ్‌ చేశారు. నిందితులను అరెస్టు చేసి సంబంధిత న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితులకు  జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించాలని ఆదేశించారు. ఈ వ్యవహారంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

కోల్‌కతా, హైదరాబాద్ లింకులపై డీఆర్‌ఐ అరా..

విదేశీ బంగారం కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు దర్యాప్తును మరింత విస్తృతం చేసింది. భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు సాగుతున్న ఈ అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ నెట్‌వర్క్ ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.పట్టుబడిన ఇద్దరు నిందితులు కేవలం రవాణా చేసే ‘క్యారియర్లు’ మాత్రమేనని భావిస్తున్న అధికారులు, తెరవెనుక ఉన్న కీలక సూత్రధారుల భరతం పట్టేందుకు రంగం సిద్ధం చేశారు.హైదరాబాద్‌లో విదేశీ బంగారం డెలివరీ తీసుకోవాల్సిన బడా వ్యాపారులు లేదా హవాలా ఏజెంట్లు ఎవరు..?అన్న కోణంలో అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. పట్టుబడిన నిందితుల మొబైల్ ఫోన్లు,కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ చాట్‌లు, బ్యాంక్ లావాదేవీలను అధికారులు క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు.ఈ ముఠా వెనుక కోల్‌కతా, హైదరాబాద్‌ కేంద్రాలుగా పనిచేస్తున్న బంగారం వ్యాపారుల హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు.