BREAKING
48వ డివిజన్‌లో విద్యుత్ అంతరాయం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇచ్చిన ఆ సలహానే నాకు శ్రీరామరక్ష.. యంగ్ పేసర్ ఆకిబ్ నబీ కీలక వ్యాఖ్యలు! 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు -రాష్ట్రంలోనే నెంబర్-1 గా నిర్వహించాలి: చైర్మన్ డా.రెడ్డివారి గురువారెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం

పశువిజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

Select Suryaa Now
పశువిజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలపై విద్యార్థులకు అవగాహన సదస్సు

​కావలి, మేజర్ న్యూస్ :   పట్టణంలోని జవహర్ భారతి డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న డాక్టర్ ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో 'పశువిజ్ఞాన శాస్త్రంలో నూతన ఆవిష్కరణలు - భవిష్యత్తు అవకాశాలు' అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విక్రమ సింహపురి యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ డైరెక్టర్ వి. శైలజ ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో డైరీ సైన్స్, ఆక్వాకల్చర్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. పాలు, పాల ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ వల్ల ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో ఆక్వా కల్చర్ కారిడార్ల విస్తరణ, ఎగుమతుల వృద్ధితో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను ఆమె వివరించారు. ​కళాశాల ప్రిన్సిపాల్ పి. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కళాశాలలో ఉన్న వసతులను ఉపయోగించుకుని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలన్నారు. డీన్ డాక్టర్ బి. సుబ్రమణ్యం నాయుడు మాట్లాడుతూ, డైరీ, ఆక్వాకల్చర్ విద్యార్థులకు వివిధ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల డైరెక్టర్ డాక్టర్ ఆర్. మాల్యాద్రి, జువాలజీ విభాగాధిపతి డాక్టర్ జి. రమణారెడ్డి మాట్లాడుతూ.. తమ కళాశాల విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ప్రస్తుత విద్యార్థులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు. ​కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన డైరీ సైన్స్ అధ్యాపక బృందాన్ని విశ్వోదయ రెక్టర్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, వి. సుధాకర్ రెడ్డి అభినందించారు. డైరీ సైన్స్ లెక్చరర్ డాక్టర్ జి. అమరావతి అతిథులను వేదికపైకి ఆహ్వానించగా, ఆక్వాకల్చర్ లెక్చరర్ సిహెచ్. ప్రత్యూష వందన సమర్పణ చేశారు.