పసలేని టీసీఎస్ వ్యవస్థను రద్దు చేయాలి
ఎస్వీయూలో కోట్ల రూపాయాల వ్యయంతో తీసుకువచ్చిన టీసీఎస్ వ్యవస్థ వల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపయోగం లేదని తక్షణం ఆ వ్యవస్థను రద్దు చేయాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర కార్యదర్శి జెన్నే మల్లికార్జున డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వర్సిటీ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి రిజిస్ట్రార్ భూపతినాయుడును కలిసి సమస్యలను విన్నవించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లా పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల హాల్ టికెట్లలో ఫొటోలు లేకపోవడం, పరీక్షా కేంద్రాల పేర్లు తప్పుగా ఉండటం వంటి లోపాలను వెంటనే సరిచేయాలని కోరారు. అలాగే లా పరీక్షల ఫలితాలతో పాటు, పలు పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాల జాప్యాన్ని సహించేది లేదని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే యూనివర్సిటీ పరిపాలనా విభాగాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి కుమార్, యూత్ కాంగ్రెస్ నాయకులు శోభ రాజు, శశిధర్, ప్రేమ్ కుమార్, నందకుమార్, బాలు పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి