పల్లె పండుగ 3.0' సభలో జనసముద్రంగా కావలి.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అపూర్వ స్పందన!
- పల్లె పండుగ 3.0' సభలో జనసముద్రంగా కావలి.. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అపూర్వ స్పందన!
కావలి / మంగళవారం:29
నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం రామాపురంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్న ప్రతిష్టాత్మక 'పల్లె పండుగ 3.0' ప్రారంభోత్సవ సభకు కావలి నియోజకవర్గం నుంచి కూటమి శ్రేణులు భారీ ఎత్తున తరలివెళ్లాయి. కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని మూ మూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులతో సభా ప్రాంగణం, దారి పొడవునా జనసముద్రంలా మారింది.
నాయకులు, శ్రేణులకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆత్మీయ ఆతిథ్యం:
కావలి నియోజకవర్గం మూలమూలల నుండి ఉత్సాహంగా తరలివచ్చిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు.
ప్రత్యేక వసతులు & ఆహార ఏర్పాట్లు: సభకు బయల్దేరిన ప్రజలకు, కూటమి నేతలకు స్వయంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో రుచికరమైన చికెన్ బిర్యానీ, తాగునీటి బాటిళ్లను ప్రత్యేకంగా పంపిణీ చేశారు. బస్సులు, వాహనాల కాన్వాయ్ ప్రయాణం నుంచి సభా ప్రాంగణంలో సౌకర్యాల వరకు ఏర్పాట్లను ఎమ్మెల్యే గారు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి, పర్యవేక్షించారు.
సీఎం, డిప్యూటీ సీఎంలతో మర్యాదపూర్వక భేటీ:
సభా ప్రాంగణానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కావలి నియోజకవర్గం నుంచి వచ్చిన అపార జనసందోహాన్ని, కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి అధినేతలు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో గ్రామ గ్రామాన సంక్షేమం, అభివృద్ధి వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. కావలి అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూ, ప్రజల వెంట ఉండేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కావలి నుంచి జన సమీకరణను విజయవంతం చేసిన కూటమి నేతలు, కార్యకర్తలు మరియు ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు