BREAKING
70 బిలియన్ డాలర్లకు చేరిన ఓపెన్ ఏఐ వార్షిక ఆదాయం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ మార్కాపురం పట్టణమును అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం,మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి. జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: ఎంపీ హరీష్ బాలయోగికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం వినతి శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు -చిన్నారులకు దంత సంరక్షణపై అవగాహన పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి పర్యావరణ పరిరక్షణదిశగా ఐకియా సంచలన నిర్ణయం పొడగట్లపల్లి ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గండి శ్రీను ఎన్నిక.. ఫ్రాన్స్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత! పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్ హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా! మొసలపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుత్తుల లక్ష్మణ్: ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి........... తిరుపతి రూరల్ సీఐ ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!

స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ..అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలపై దృష్టి..

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ..అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలపై దృష్టి..

అమలాపురం మేజర్ న్యూస్ :రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీచేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోకల వరదరాజు సాంచి తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ నాయకత్వం, అరవింద్ కేజ్రీవాల్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మున్సిపాలిటీల్లో, ముఖ్యంగా అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో కూడా అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు.
అమలాపురం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతి రహిత పాలనను కోరుకునే వారికి ఆమ్ ఆద్మీ పార్టీ పెద్దపీట వేస్తుందని అన్నారు. రాజకీయాల్లో ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని ఆరోపించారు. దేశంలో, ఆంధ్రప్రదేశ్‌లో పాలనా మార్పు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఉచిత పథకాల పేరుతో ప్రజలను రాజకీయాలకు కట్టిపడేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు విమర్శించారు. ప్రజలు స్వయం శక్తితోఎదిగే అవకాశాలను ప్రభుత్వాలు కల్పించాల్సి గానీ ఉచితాలు కాదన్నారు  మనలను ఎవరో మార్చారు. మనమే మార్పు తీసుకురావాలి” అని పిలుపునిచ్చారు.
అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల తరఫున పోరాడుతుందని తెలిపారు. మున్సిపాలిటీలను అవినీతికి దూరంగా, ప్రజలకు జవాబుదారీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి పాలనలో మార్పు తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎటువంటి ఖర్చు లేకుండా బీ-ఫారాలు పొందవచ్చని నాయకులు తెలిపారు. ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలన్నదే తమ పార్టీ విధానమని పేర్కొన్నారు.ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ మెర్లశాస్త్రులు, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్లూరి కృష్ణమోహన్, జిల్లా కార్యదర్శి శనివారపు ఫణి, అమలాపురం టౌన్ ప్రెసిడెంట్ సవల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.