BREAKING
70 బిలియన్ డాలర్లకు చేరిన ఓపెన్ ఏఐ వార్షిక ఆదాయం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ప్రధాని మోదీ లక్ష్యం: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ పెర్మిపాలెం అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు పండ్లు, స్వీట్ల పంపిణీ మార్కాపురం పట్టణమును అభివృద్ధికి చిరునామాగా మారుస్తాం జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పించండి: ఎంపీ హరీష్ బాలయోగికి ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రామం వినతి శ్రీచైతన్య పాఠశాలలో ఉచిత దంత పరీక్షలు -చిన్నారులకు దంత సంరక్షణపై అవగాహన పేదల స్థలాలకు స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలి పర్యావరణ పరిరక్షణదిశగా ఐకియా సంచలన నిర్ణయం పొడగట్లపల్లి ఓరియంటల్ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గండి శ్రీను ఎన్నిక.. ఫ్రాన్స్ ప్లాంట్లలో కార్ల ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత! పెదముషిడివాడ హైస్కూల్ నూతన చైర్మన్‌గా గోవింద్ హిరమండలం మండలంలో 55 పాఠశాలల్లో SMC ఎన్నికలు విజయవంతం: 3 పాఠశాలల్లో కోరం లేక వాయిదా! మొసలపల్లి ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా గుత్తుల లక్ష్మణ్: ఘనంగా పాలకవర్గ ప్రమాణ స్వీకారం మధ్యవర్తిత్వం పై అవగాహన సదస్సు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి........... తిరుపతి రూరల్ సీఐ ఉప్పరాపల్లిలో అంగన్వాడీ ఉత్సవం, పోషణ మాసోత్సవం!

అపారిశుధ్యం నిర్మూళించే బాధ్యత గ్రామ కార్యదర్శులదే

Select Suryaa Now
అపారిశుధ్యం నిర్మూళించే బాధ్యత గ్రామ కార్యదర్శులదే
  • తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సూపర్ శానిటేషన్

 జిల్లా పంచాయతీ అధికారి మల్లిఖార్జునరావు

రామభద్రపురం, సెప్టెంబర్ 29(మేజర్ న్యూస్: గ్రామ పంచాయతీల్లో అపారిశుధ్యం నిర్మూళించే బాధ్యత గ్రామ కార్యదర లదేనని జిల్లా పంచాయతీ అధికారి డోలా వెంకట మల్లిఖార్జునరావు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ రథాలపై ప్రజలకు అవగాహన కల్పించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే తడి, పొడి చెత్తను తీసుకొని తద్వారా డబ్ల్యుపిసి సెంటర్లను బలోపేతం చేయాలన్నారు. తద్వారా వర్మికంపోస్టును తయారు చేయాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీల్లో పిజిఆర్ఎస్ ద్వారా వచ్చే వినతులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలిపారు. ఇటీవల తుఫాను కారణంగా గ్రామ పంచాయతీలో పారిశ ధ్యాన్ని మెరుగుపరిచేందుకు సూపర్ శానిటేషన్ కార్యక్రమాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున చేపడుతున్నట్టు తెలిపారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా చేయాలని సూచించారు. అలాగే కాలువల్లో పూడికతీత పనులు, రక్షిత మంచినీటి పధకాలను శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 770 పంచాయతీలకు గానూ 685 పంచాయతీలకు కార్యదర్శులు ఉన్నారని, కార్యదర్శిలేని గ్రామాలకు ఇన్ఛార్జ్ లతో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే త్వరలో గ్రామ పంచాయతీ కార్యదర్శులను మూడు గ్రేడుల్లో విభజించి విలీనం చేస్తామని తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.2 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేసే గ్రామ కార్యదర్శులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. ఈ సమావేశంలో ఎంపిడీవో ఎన్.రత్నం, ఈవోపీఆర్డీ వెంకటరమణ పాల్గొన్నారు.