ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని కలిసిన నూతన సీడీపీవో సిహెచ్. శ్రీదేవి
లక్క వరపు కోట , సెప్టెంబర్ 29: ఎస్.కోట ఐసీడీఎస్ ప్రాజెక్టు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో)గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిహెచ్. శ్రీదేవి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారిని మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఎల్.కోటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంల ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన బాధ్యతల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి నూతన సీడీపీవోకు శుభాకాంక్షలు తెలుపుతూ.. నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మరింత మెరుగుపరచాలని సూచించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం సక్రమంగా చేరేలా పర్యవేక్షించాలని, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి పారదర్శకంగా తీసుకెళ్లాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో మహిళా, శిశు సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు.
అనంతరం సీడీపీవో శ్రీదీప్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఐసీడీఎస్ సేవలను పకడ్బందీగా అమలు చేస్తామని, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు సేవల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించి మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.