పదవులు బాధ్యతలను పెంచుతాయి శాఖవరపు వేణుగోపాల్, జిల్లా పీఎంపీ అధ్యక్షులు.
నెల్లూరు రూరల్ మేజర్ న్యూస్ : పదవి అనేది బాధ్యతలను పెంచుతాయని నెల్లూరు జిల్లా పి.ఎం.పి అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్ అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో బుధవారం, బుజబుజ నెల్లూరులోని పిఎంపి కార్యాలయం నందు పిఎంపి నూతన కార్యవర్గంలో 11వ సారి అధ్యక్షుడిగా ఎన్నికైన తనకు, మూడోసారి గౌరవాధ్యక్షులుగా ఎంపికైన డా. అనుముల జయప్రకాష్ కు మిత్రులు చేసిన సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పదవులు అనేవి అలంకారప్రాయం, నామమాత్రం కాదని ఎంతో బాధ్యతతో కూడినపని అని ఆయన పేర్కొన్నారు. పదవిలో ఉన్నప్పుడు సంక్షేమంతో పాటు వారి సమస్యలను పరిష్కరించవలసి ఉంటుందని అప్పుడే సభ్యులలో ఆత్మీయత, స్నేహభావ్యం, ధైర్యం నెలకొల్తోందని ఆయన పేర్కొన్నారు. సత్కారసభ సంతోషంతో పాటు బాధ్యతను గుర్తు చేస్తున్నాయని అన్నారు. తన విధులను గుర్తించి సభ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ రసూల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కుడుముల సుబ్బారావు, విశ్రాంత ఏఎస్ఐ మహబూబ్ బాషా, పీఎంపీ సభ్యులు దేవరకొండ శ్రీనివాసులు, కూనిశెట్టి పెంచలలక్ష్మి, సింహాద్రి నాగరాజు, మధుసూదన్ రావు, మహేష్ సాయి తదితరులు పాల్గొన్నారు.