పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న బాపూజీనాయుడుకు ఘన సత్కారం
గరుగుబిల్లి, సూర్య : ఉమ్మడి విజయనగరం, పార్వతిపురం మన్యం జిల్లాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న మరిశర్ల బాపూజీనాయుడుకు రావి వలస గ్రామస్తులతోపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం రాత్రి ఘనంగా సత్కరించారు.గ్రామానికి చెందిన నాయకుడు ఉన్నత పదవిలో ఐదేళ్లపాటు సేవలందించిన సందర్భం గా గ్రామస్తులు జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు ను గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు బాపూజీనాయుడును అభినందించా రు.ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, గ్రామానికి చెందిన వ్యక్తి ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల స్థాయి లో కీలక పదవిని చేపట్టి ఐదేళ్లపాటు కొనసాగడం గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు.ఉమ్మడి విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల జిల్లా పరిషత్తు వైస్ చైర్మన్ గా అందించిన సేవలను గుర్తించి గ్రామస్తులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషంగా నిలిచింది.ఈకార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, కురుపాం నియోజక వర్గం మాజీ శాసనసభ్యులు మరియు మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రాపు సత్యనారా యణ మాస్టారు,గుంట్రెడ్డి పద్మావతి, మరడాన వెంకటనాయుడు, తెర్లి ఎల్లమునాయుడు,కలిశెట్టి ఇందుమతి, ముదిలి గౌరు నాయుడు,అంబటి గౌరు నాయుడు,గంట తాతబాబు నాయుడు,చందక వెంకటేష్, మరడాన అశోక్ కుమార్, గుజ్జల ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శశి భూషణరావు, గరుగుబిల్లి, పార్వతిపురం మన్యం.