ఓటు హక్కు వినియోగించుకున్న వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్
అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్ : అనంతపురం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి సి. రమేష్ గౌడ్ ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నగరంలోని మొదటి రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
అనంతరం తన వేలిపై వేసిన చెరగని సిరా గుర్తును పాత్రికేయులకు చూపించారు. తన గెలుపు పై ధీమా ను వ్యక్తం చేశారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్.