ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను జగన్ నట్టేట ముంచారు..ఎమ్మెల్యే అమిలినేని*
అనంతపురం బ్యూరో
ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను జగన్ నట్టేట ముంచారు..ఎమ్మెల్యే అమిలినేని*
*మనకు నీళ్లు రాకపోవడానికి పూర్తి పాపం వైసీపీ ప్రభుత్వానిదే*
*గాంధీ జయంతి రోజున హార్టికల్చర్ హబ్ పథకం ప్రారంభించనున్న కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రులు*
*వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు లేకుండా చేశారు..కూటమి ప్రభుత్వం వచ్చాకే సర్పంచులకు నిధులు వచ్చాయి..*
*వచ్చే రెండేళ్లలో గ్రామాల నుంచి పొలాలకు వెళ్లే దారులు నిర్మిస్తాం*
ఒక్క ఛాన్స్ ఇవ్వండి రాజన్న పాలన తీసుకువస్తాను అని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు, డ్రిప్పు, స్పింక్లర్లు ఏ ఒక్కటి కూడా రైతులకు ఇవ్వకుండా, దాంతో పాటు బీటీపీ పనులను ఆపేసి రైతులను జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచాడని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పేర్కొన్నారు..నేడు కళ్యాణదుర్గం మండలం మల్లిపల్లి గ్రామంలో రాయలసీమ విజయీభవ కార్యక్రమంలో టమోటా, బొప్పాయి పంటలు సాగు చేసిన రైతుల పొలాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు, మండల పార్టీ నాయకులతో కలసి పర్యటించి వారితో మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు మాట్లాడుతూ అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 10 జిల్లాలకు మేలు జరిగే అత్యంత గొప్ప పథకాన్ని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రుల చేత మదనపల్లెలో హార్టికల్చర్ హబ్ ప్రారంభం కాబోతోందని, ఈ పథకానికి కేంద్రం 40 వేల కోట్లు ఇవ్వనుండగా, బ్యాంకులు మరో 60 వేల కోట్లు రుణంగా అందించనుందని దీంతో రాయలసీమ, అనంతపురంతో పాటు మన కళ్యాణదుర్గం ప్రాంతానికి కూడా మేలు జరుగుతుందని, బీటీపీ పథకానికి, వ్యవసాయ పరికరాలు, హార్టికల్చర్ పంటల కోసం, రోడ్ల కోసం నిధులు రానున్నాయని పేర్కొన్నారు..గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులకు నిధులు ఇవ్వకుండా వారు ఉన్నారు అన్న సంగతి మర్చిపోయేలా చేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలకు నిధులు ఇవ్వగా వైసీపీ సర్పంచులు ఇస్తానుసారంగా నిధులు తినేశారన్నారు..మాములుగా మన ప్రాంతానికి ఎలాంటి నీటి వనరులు లేవు కేవలం వర్షాదారం మీదనే ఆధారపడి పంటల సాగు చేస్తున్నామని అలాంటిది ఈ ఏడాది ఎల్ నినో కారణంగా మనకు మరింత ఎక్కువగా ప్రభావం పడిందని 2028 మార్చి నాటికి బీటీపీ పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇస్తామని అన్నారు..నీళ్లు వస్తే మన రైతులు మరింత నాణ్యమైన పంటలను పండించి అధిక దిగుబడులతో మరింత ఆదాయాన్ని పొందుతారని, రోడ్లు బాగుంటే మార్కెట్ కు కూడా సరుకును త్వరగా తీసుకెళ్లిమంచి ధరలకు అమ్ముడు అవుతాయన్నారు.అంతే కాకుండా రాబోయే రెండేళ్లలో గ్రామాల నుంచి పంట పొలాలకు వెళ్లే దారులను కూడా నిర్మించి రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు…