BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

నూజివీడు లో నామినేషన్ల సందడే... సందడి...- 110 నామినేషన్ల దాఖలు - భారీ స్థాయిలో ఊరేగింపుగా వచ్చిన అభ్యర్థులు!

Select Suryaa Now
నూజివీడు లో నామినేషన్ల సందడే... సందడి...- 110 నామినేషన్ల దాఖలు   - భారీ స్థాయిలో ఊరేగింపుగా వచ్చిన అభ్యర్థులు!

నూజివీడు, మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా నూజివీడు పురపాలక సంఘం పరిధిలో జరుగుతున్న వార్డు కౌన్సిలర్లు, చైర్మన్ పదవులకు ఆదివారం నాడు ఎంతో సందడి సందడిగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భారీ స్థాయిలో ఊరేగింపుతో  వచ్చిన కూటమి అభ్యర్థులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కూటమి చైర్మన్ అభ్యర్థిగా బర్రె ఇళయరాజా మంత్రి పార్థసారథి సమక్షంలో అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా నూజివీడు పట్టణాన్ని గడచిన కాలంలో అభివృద్ధి చేశానని, జరిగిన అభివృద్ధి అభ్యర్థుల విజయానికి సోపానమని అన్నారు. అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్ అభ్యర్థులు,  పార్టీ నాయకులు పాల్గొన్నారు.

లవ కుమార్ నామినేషన్ దాఖలు 

నూజివీడు పురపాలక సంఘం ఎన్నికలలో చైర్మన్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న  కంచర్ల లవ కుమార్ ఆదివారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ముందు స్థానిక ద్వారకా ఎస్టేట్ నుంచి భారీ స్థాయిలో ఊరేగింపుగా పురపాలక సంఘం కార్యాలయానికి తరలి వెళ్లారు. నూజివీడు మాజీ శాసనసభ్యులు మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆశీస్సులతో చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని, నూజివీడు పురపాలక సంఘంలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ తనను బలపరచాలని కంచర్ల లవ కుమార్ కోరారు. నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి, పురపాలక సంఘం కమిషనర్ పిరయ్యకు అందజేశారు.

 ఇండియా కూటమి బలపరిచిన చైర్మన్ అభ్యర్థిగా భత్తుల లక్ష్మీ కోటేశ్వరమ్మ, స్వతంత్ర చైర్మన్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ న్యాయవాది ఇందుపల్లి సత్య ప్రకాష్ లు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఉన్నారు. చైర్మన్ వార్డ్ కౌన్సిల పదవులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్వతంత్రులు కలిపి 110 నామినేషన్లో దాఖలు అయినట్లు అధికారులు తెలిపారు.

 రిపోర్టర్ తాత ప్రసాద్ నూజివీడు ఏలూరు జిల్లా,