నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా పిడతల సుధాకర్, భవనాసి శ్రీనివాస, మిద్దె వెంకట సుబ్బయ్యలను నియమించిన జనసేన పార్టీ
సూర్య, నంద్యాల బ్యూరో:
రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా క్షేత్ర స్థాయిలో సమాచారాన్ని సేకరించి పార్లమెంటు కో ఆర్డినేషన్ కమిటీకి సమాచారాన్ని అందించేందుకు నంద్యాల జిల్లాలో కీలకమైన నంద్యాల అసెంబ్లీ కో ఆర్డినేషన్ కమిటీని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల వారీగా అసెంబ్లీ కోఆర్డినేషన్ కమిటీలని ఏర్పాటు చేశారు.ఈ కమిటీలో నంద్యాల అసెంబ్లీ సమన్వయకర్తగా పిడతల సుధాకర్, భవనాసి శ్రీనివాస, మిద్దె వెంకట సుబ్బయ్యలు చోటు దక్కించుకున్నారు. వీరికి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిడతల సుధాకర్భవనాసి శ్రీనివాసలు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి తమకు ఈ అవకాశాన్ని కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నాయకులతో సమన్వయం చేసుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నిర్ణయించిన అభ్యర్థుల్ని గెలిపించుకుంటామన్నారు.
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*