BREAKING
అనుమతులు ఘనం.. బిల్లులు శూన్యం బీవీసీలో భట్లపాలెం నందు యువజన ఉత్సవాలు.. గోవింద నామస్మరణతో మార్మోగిన వాడపల్లి వెంకన్న ఆలయం మోడరన్ హైస్కూల్ లో ఆకట్టుకున్న రోబోటిక్స్ శిక్షణా కార్యక్రమం నగరంలో అంగన్వాడి ఉత్సవ్ వేడుకలు సైన్స్ ఎగ్జిబిట్స్‌పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపు. నేటి రాశి ఫలాలు: 4 అక్టోబర్ 2026, ఆదివారం.. నేటి పంచాంగం: 4 అక్టోబర్ 2026, ఆదివారం మృతుల కుటుంబాలకు బిఆర్ఎస్ ఆర్థిక సహాయం కళ్యాణదుర్గం టి - సర్కిల్ అభివృద్ధి పనులకు శ్రీ కారం. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి నెక్కొండలో ఉపేందర్ హాస్పిటల్ పై అధికారుల దాడి అర్హులైన పట్టభద్రులు ఫారం- 18 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలి హనుమకొండ ఆర్టీసీ డిపోలో ఎన్నికల ప్రచారం కళ్యాణదుర్గం కొల్లాపూరమ్మ ఆలయం లో చోరీ.

నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పర్యటన

Select Suryaa Now
నేడు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు పర్యటన


మెలియాపుట్టి. అక్టోబర్ 2. మేజర్ న్యూస్...
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 10 గంటలకు మెలియాపుట్టి మండలంలోని  సంతలక్ష్మీపురం వద్ద బీటీ రోడ్డును ప్రారంభిస్తారు. 11 గంటలకు భరణికోట పంచాయతీ పరిధిలోని కోతికొలింగాం గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చాపరలో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
12.30 గంటలకు కోసమలలో పల్లెపండుగ-3.0, కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. 1.30 గంటలకు మెళియాపుట్టి మండల కేంద్రంలో గ్రంథాలయం, రెవెన్యూ పెట్రోల్‌ బంక్‌ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. 2.30 గంటలకు రింపి రోడ్డును, 3 గంటలకు కొత్తపేట బీటీ రోడ్డు, అంగన్‌వాడీ కేంద్రాన్ని ప్రారంభిస్తారు.
సాయంత్రం 3.30 గంటలకు పాతపట్నం మండల కేంద్రంలో రైతుబజార్‌కు శంకుస్థాపన, 4 గంటలకు పలు రోడ్లను ప్రారంభిస్తారు. 5 గంటలకు సీదిలో బ్యాడ్మింటన్‌ కోర్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమాలకు ఐదు మండలాల ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శి అనపాన రాజశేఖర్‌రెడ్డి కోరారు.