నేడు ఇంకొల్లులో ఉచిత కంటి వైద్యశిబిరం
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ : ఇంకొల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు శంకర కంటి వైద్యులు ఇంకొల్లు వచ్చి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేస్తారన్నారు. ఇంకొల్లు పరిసర ప్రాంత ప్రజలు శిబిరంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.