BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

నరసాపురం జడ్పిటిసి కి స్వతంత్ర అభ్యర్థిగా నాగ వెంకటలక్ష్మి నామినేషన్

Select Suryaa Now
నరసాపురం జడ్పిటిసి కి స్వతంత్ర అభ్యర్థిగా నాగ వెంకటలక్ష్మి నామినేషన్

 భీమవరం,నరసాపురం, మేజర్ న్యూస్ : జడ్పీటీసీ కి స్వతంత్ర అభ్యర్థిగా కూనపరెడ్డి నాగ వెంకటలక్ష్మి బుధవారం భీమవరంలో జాయింట్ కలెక్టర్ ఆర్ కల్పశ్రీకి  తన నామినేషన్ పత్రాలు అందజేశారు. మండలంలోని యర్రంశెట్టివారిపాలెం గ్రామ మాజీ సర్పంచ్, కాపు సంఘం నాయకులు, కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు కుమార్తె అయిన నాగ వెంకటలక్ష్మి ఈ ఎన్నికల బరిలో నిలిచారు.

ఈ సందర్భంగా ఆమె తండ్రి కూనపరెడ్డి విజయ రంగారావుతో కలసిన నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం స్వగ్రామం వైఎస్ పాలెం లో విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి రంగారావు ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాడుతున్నారని, సర్పంచిగా పనిచేసిన ఐదేళ్లలో సుమారు ఐదు కోట్లతో గ్రామాన్ని అభివృద్ధి చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని మండల అభివృద్ధి కోసం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నాగ వెంకటలక్ష్మి తెలిపారు. ఎమ్మెస్సీ పూర్తి చేసిన నాగ వెంకటలక్ష్మికి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉందని రంగారావు పేర్కొన్నారు. ఒక ఉన్నతమైన, సేవాభావం ఉన్న కుటుంబం నుండి వచ్చిన ఆమెను రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు. ఉన్నత విద్యావంతురాలైన నాగ వెంకటలక్ష్మిని ప్రజలు తమ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయ రంగారావు  మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.