నదుల్లో చెత్త వేస్తే జరిమానా తప్పదు* • నగర ప్రజలకు కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపు
*నదుల్లో చెత్త వేస్తే జరిమానా తప్పదు*
• నగర ప్రజలకు కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపు
• అపరిశుభ్రతతో ప్రజారోగ్యానికి ముప్పు
నదులు, కాలువలు, నీటి ప్రవాహ మార్గాలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా నగర ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవ హరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపుని చ్చారు. మంగళవారం కేసీ కెనాల్‌లోని వినాయక ఘాట్, రాజ్‌విహార్, వై. జంక్షన్, బిర్లా కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో పారిశు ద్ధ్య పనులను పరిశీలిం చారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని, చెత్తను ఇష్టానుసారంగా పడేయ డం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని తెలిపారు. నదులు, కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్త వేయడం వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలగడమే కాకుండా పరిసరాలు అపరిశుభ్రంగా మారి దోమలు, ఈగలు వృద్ధి చెందే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల ప్రజలు వివిధ అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహం లేని నేపథ్యంలో, నిల్వ ఉన్న నీటిలో చెత్తాచెదారం వేయడం వల్ల ప్రజారోగ్యా నికి ముప్పు వాటిల్లుతుం దని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా,ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చేపడుతున్న పారిశు ద్ధ్య కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.