నామినేషన్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్
నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల దృష్ట్యా నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద దర్గామిట్ట పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ కళ్యాణ్ రాజు తన సిబ్బంది నీ అప్రమత్తం చేసి ఇతరులు నామినేషన్ కేంద్రానికి వెళ్ళనీకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ దారులు మినహా ఇతరులను ఎవ్వరిని నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్ళనీకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపడం జరిగింది ఈ కార్యక్రమంలో దర్గా మిట్ట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మయ్య తదితరులున్నారు.