నామినేషన్ కేంద్రం పరిశీలన
కోటబొమ్మాళి, అక్టోబరు 18, మేజర్ న్యూస్ : ఈ నెల 21వ తేదీ నుంచి ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో స్థానిక ఎంపీడీవో కిల్లారి నారాయణరావు, ఎస్ఐ వంగపండు సత్యన్నారాయణలు ఆదివారం నామినేషన్ కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయాన్ని పరిశీలించారు. అభ్యర్థులు వచ్చి నామినేషన్ వేసుకుని వెళ్లే విధంగా అన్ని మౌళిక సదుపాయాలు కల్పించావ ని ఎంపీడీవో తెలిపారు. నామినేషన్ జరుగు తేదీలలో కార్యాలయం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన ఎస్ఐకి సూచించారు.