ముత్యాలమ్మ వద్ద అన్నదానం
గూడూరు(చిల్లకూరు), మేజర్‌న్యూస్
తూర్పు కనుపూరు వెలసియున్న ముత్యాల అమ్మవారి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం ఉదయం మూలమూర్తులకు అభిషేకం నిర్వహించడమైనది. అనంతరం భక్తులు వెయ్యి కళ్లు కుండలు, వేపాకు చీరలతో పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారిని విశేషంగా దర్శించుకున్నారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతులు, పల్లకి సేవ మరియు ఊంజల్ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమాలను చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి మరియు కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో జరిగాయి. పల్లకి సేవ ఉభయకర్తలుగా ఇప్పగుంట సతీష్ కుమార్ రెడ్డి స్మిత(బుచ్చిరెడ్డిపాలెం) దంపతులు వ్యహరించినట్లు కార్యనిర్వహకులు తెలిపారు.