ముటుకూరులో అయ్యప్ప స్వామి మహా పడిపూజకు ఘన ఏర్పాట్లు
దుర్గి మండలం ముటుకూరు గ్రామంలో రేపు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాలధారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు.బ్రహ్మారెడ్డి గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించనుండగా, మార్కాపురం శ్రీను గురుస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరగనుంది.ఈ మహా పడిపూజ కార్యక్రమాన్ని దొండపాటి వెంకటేశ్వర్లు స్వామి, దొండపాటి భాస్కర్ స్వామి 18వ పడి, దొండపాటి బాల సైదారావు స్వామి 18వ పడిఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ పవిత్ర కార్యక్రమానికి అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజల్లో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు పొందాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.పేర్ల వెంకటేశ్వర్లు సీనియర్ రిపోర్టర్ దుర్గి