మున్సిపల్ వైసీపీ అభ్యర్థి గా అల్లారెడ్డి ఇందుమతి
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు వైఎస్ఆర్సిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఆత్మకూరు పట్టణానికి చెందిన అల్లారెడ్డి ఇందుమతిని ఖరారు చేశారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ప్రకటించారు. శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు. మాజీ కౌన్సిలర్, వైసీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లారెడ్డి ఆనందరెడ్డి సతీమణి ఇందుమతి మాజీ మండలాధ్యక్షుడు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లారెడ్డి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లారెడ్డి అనసూయమ్మల కోడలు.