ముగిసినపోషణ మాసోత్సవాలు తక్కువ ఖర్చుతో బలవర్ధక వంటకాల ప్రదర్శన
వింజమూరు మేజర్ న్యూస్ : వింజమూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో గురువారం 9వ జాతీయ పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సీడీపీఓ పద్మజాకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల స్థాయి అంగన్ వాడి కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు హాజరయ్యారు. అంగన్ వాడి కార్యకర్తలు తక్కువ ఖర్చుతో తయారు చేసిన బలవర్ధక వంటకాలను ప్రదర్శనలో ఉంచారు.ఈ సందర్భంగా సీడీపీఓ పద్మజాకుమారి మాట్లాడుతూ, "మన అంగన్ వాడి - మన బాధ్యత" అనే నినాదంతో నెల రోజుల పాటు పోషణ మాస ఉత్సవాలను ఘనంగానిర్వహించామన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సేవా ప్రస్థానం 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి అంగన్ వాడి కేంద్రంలో 'అంగన్ వాడి ఉత్సవ్' పేరుతో వివిధ కార్యక్రమాలుచేపట్టామన్నారు.సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 7 వరకు జరిగిన పోషణ మాస ఉత్సవాల్లో అంగన్వాడిసేవలు,కార్యకలాపాలగురించివివరించామన్నారు. గర్భిణీలు, బాలింతలకు అంగన్ వాడి కేంద్రంలో లభించే పౌష్టికాహారంతో పాటు స్థానికంగా అందుబాటులో ఉండే పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలపై అవగాహన కల్పించామని తెలిపారు.ముఖ్యంగా పిల్లలు, పుట్టబోయే పిల్లలు, పెరుగుతున్న పిల్లలు, గర్భవతులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారం గురించిసూచించామన్నారు. అంగన్ వాడి కమిటీ సభ్యులు ప్రతి నెలా కేంద్రాన్ని సందర్శించి అందరికీ సేవలు అందేలా ప్రోత్సహించాలని కోరారు. తక్కువ ఖర్చుతో చిరుధాన్యాలతో ఇంట్లోనే పిల్లలకు చిరుతిళ్లు తయారు చేసుకోవాలని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంచి ఇంటి భోజనానికి అలవాటు చేయాలని సూచించారు. అనంతరం జాతీయ పోషణ మాసం ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సిడిపిఓ శర్మిష్టా సూపర్వైజర్లు షకీలా తేజస్విని అంగన్వాడి కార్యకర్తలు తల్లులు తదితరులు పాల్గొన్నారు.