మంత్రి ఆనం అభివృద్ధి విజన్‌పై ఆత్మకూర్ పరిశీలకులు మోహన్ రెడ్డి ప్రశంసల జల్లు
ఆత్మకూరు, మేజర్ న్యూస్ : ఆత్మకూరు మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో ఉన్నత గ్రేడ్‌కు చేర్చి, రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం శ్రమిస్తున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిబద్ధతను, ఆయన అందిస్తున్న సుపరిపాలనను నియోజకవర్గ తెలుగుదేశం పరిశీలకులు మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కొనియాడారు. ఆత్మకూరు నియోజకవర్గ అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్న మండల్ పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జీలు, బూత్ ఇంచార్జీలు, యూనిట్ ఇంచార్జీలు మరియు బిఎల్ఎలు అందరూ ఒకే తాటిపైకి వచ్చి, రాత్రింబవళ్లు కష్టపడి ఆనం గారి సేవాతత్పరతకు, నాయకత్వ పటిమకు మరియు అలుపెరుగని శ్రమకు ప్రతిఫలంగా ఆత్మకూరు ప్రజలు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మనమందరం కలిసికట్టుగా ఓటు వేసి, కూటమి ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఆయన పేర్కొన్నారు.ఆత్మకూరు ప్రగతిని ముందుకు తీసుకెళ్దామని మోహనరెడ్డి కోరారు.