మెడికవర్ వైద్య సేవలు ద్వారా 70 మందికి ఉచితంగా పరీక్షలు
సీతంపేట, సూర్య : సీతంపేట గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం మెడికవర్ వైద్య బృందంసౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది శిబిరంలో బిపి షుగర్ ఈసీజీ తదితర వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించడం జరిగింది. దీనిలో గౌరవ జిల్లా లెజి స్లటివ్ కౌన్సిల్ మెంబర్ ఇమరిక పవన్ గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి ఎల్ శ్రీనివాసరావు గారు,పంచాయతీ కార్యదర్శి బి.రామకృష్ణ గ్రామ సచివాలయ సిబ్బంది మెడికవర వారి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ సేవలను సుమారు 70 మంది ఈ వైద్య శిబిరం లో సేవలను అందుకోవడం జరిగిందనీ ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
రిపోర్టర్ : సత్యదేవ్ కెల్లా, సీతంపేట, పార్వతీపురం మన్యం.