మెడికల్ సీట్ సాధించిన తెరిసా కళాశాల విద్యార్థిని షేక్ సఫియా
మెడికల్ సీట్ సాధించిన తెరిసా కళాశాల విద్యార్థిని షేక్ సఫియా
ఆత్మకూర్, మేజర్ న్యూస్ :
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని థెరిసా కళాశాల విద్యార్థినీ షేక్ సఫియా మెడికల్ సీట్ సాధించినట్లు sv group of institutions chair person బి జి వసుంధర, థెరిస్సా కళాశాల డైరెక్టర్ సాయి ప్రణీత్ తెలిపారు. శనివారం వెలువడిన ఫైనల్ ఫేస్ లో కడప ఫాతిమా మెడికల్ కళాశాలలో సీటు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణానికి చెందిన షేక్ చాంద్ బాషా, షేక్ మహబూనిస దంపతుల కుమార్తె షేక్ సఫియా మెడికల్ సీట్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మా కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని మెడికల్ సీట్ సాధించడం పట్ల విద్యార్థినీ షేక్ సఫియా కృషి,పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల కృషి ఎంతగానో ఉందన్నారు.మెడికల్ సీటు సాధించడం పట్ల తోటి విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపకులు,తల్లిదండ్రులు, బంధుమిత్రులు అభినందించారు.