మత్తుపదార్థాల అక్రమ రవాణాపై పోలీస్ నిఘా మరింత పటిష్టం : బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్
గంజాయి, ఇతర మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు బాపట్ల జిల్లా పోలీస్ శాఖ మరింత పటిష్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాలను గుర్తించడంతో పాటు నేరస్థుల ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన హంటర్ జగిలన్నీ దాని హ్యాండ్లర్లను అడ్మిన్ ఆర్‌ఐ షేక్ మౌలుద్దీన్ శనివారం ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ హంటర్ పొందిన శిక్షణ, దాని నైపుణ్యాలు, విధుల నిర్వహణలో దాని సేవలను ఏ విధంగా వినియోగించుకోవచ్చనే అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు.