మర్రిపాడు ఎల్లమ్మ తల్లి గుడిలో భవాని దీక్షలు
సంతబొమ్మాలి,
మండలంలో మర్రిపాడు ఇలవేల్పు ,కోరిన కోర్కెల తీర్చే కల్పవల్లి ,పిలిచిన పలికే దైవం శ్రీ ఎల్లమ్మ తల్లి గుడిలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలువురు భవానీ దీక్షలు తీసుకున్నారు. ఉత్తరాంధ్రలో ఓ ప్రముఖ పుణ్యక్షేత్రమైన మర్రిపాడు శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయంలో సంవత్సర కాలము నుండి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రముగా నిత్యం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ నిరంతరం ఆధ్యాత్మిక మార్గములో నడుస్తున్న ఎల్లమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సంతబొమ్మాలి మండల మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు అట్టాడ రాంప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా రాంప్రసాద్ మాట్లాడుతూ దీక్షలు చేసే భక్తులు త్రికరణ శుద్ధితో భక్తి మార్గముతో నిష్ట నియమాలతో దీక్షలు నిర్వహించినట్లయితే ప్రతిఫలం ఆశించకుండా ఆదిపరాశక్తి శ్రీ ఎల్లమ్మ తల్లి అందరికీ ఫలితం అందిస్తుందని ప్రతిఫలాన్ని ఆశించకుండా దీక్షలు సజావుగా ప్రశాంతముగా నిర్వహించే విధంగా సన్నిధాన గురుస్వామి లోపింటి రాజారెడ్డి కి సహకరిస్తూ భవానీ దీక్షపరులు గురు స్వామి చెప్పిన నియమ నిబంధన ప్రకారం నడుచుకొని నవరాత్రులకు నవ ప్రత్యేకతలు ఉన్నాయని తల్లి గర్భము నుండి మానవ జన్మ ఇచ్చినప్పుడు నవ మాసాలకు నవరాత్రులకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాలాధారణ గురుస్వామి నాగేష్ శర్మ , 40 మంది భవాని దీక్షలు తీసుకున్నారు. సన్నిధాన గురుస్వామి లోపింటి రాజారెడ్డి మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.