BREAKING
పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం, అయినవిల్లి కార్యనిర్వహణాధికారి వారి సమక్షములో ధర్మకర్తల మండలి సమావేశం దివాన్ చెరువులో జక్కంపూడి రామ్మోహన్ రావుకు ఘన నివాళి :పేద మహిళలకు చీరల పంపిణీ తాతల నాటి కళకు.. మనవళ్ల సాంకేతికత తోడైతే.. జీఎస్టీ సమూల ప్రక్షాళన: అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు.. జీఎస్టీ సంస్కరణలకు పారిశ్రామిక వర్గాల జేజేలు.. క్యాన్సర్ మందుల ట్రేడ్ మార్జిన్లపై 30% పరిమితి: కర్ణాటక ఆరోగ్య శాఖ ప్రకటన.. రోగులకు భారీ ఊరట! నౌకా నిర్మాణ రంగం, మైన్ కౌంటర్ మెజర్స్ సహకారంపై భారత్-జపాన్ దృష్టి: వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ జపాన్ పర్యటన! నేటి రాశి ఫలాలు (10 అక్టోబర్ 2026 – శనివారం) నేటి పంచాంగం (10 అక్టోబర్ 2026 – శనివారం) పండుగ సేల్స్‌కు అదిరిపోయే ఆరంభం సామాన్య భక్తులకు 8 గంటలపాటు జగన్మాత దివ్య దర్శనం ప్రజా దర్బార్‌తో సమస్యల పరిష్కారానికి భరోసా * కంకిపాడు లాక్‌ రోడ్డులో మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల అభ్యంతరం * ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రతో మాట్లాడిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జేఎన్‌టీయూకే అంతర్ కళాశాల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ముగింపు బాలాజీనగర్‌ రవీంద్ర భారతిలో ఘనంగా దసరా వేడుకలు

మక్కువలో భూ హక్కులకు భరోసా..

Select Suryaa Now
మక్కువలో భూ హక్కులకు భరోసా..

 

7,361 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు!

“మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి

భూ వివాదాలకు చెక్‌.. స్పష్టమైన హక్కుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం

మక్కువ మండలంలో రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి పనులు

ముఖ్య రహదారులు, కాలువలకు రూ.9 కోట్లు..

 బైరసాగరం చెరువుకు వాకింగ్‌ ట్రాక్‌ హామీ

ఏపీ స్టేట్ బ్యూరో, అమరావతి :

 రైతుల భూములకు స్పష్టమైన హక్కులు కల్పించి, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి సంధ్యారాణి అన్నారు. మక్కువ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో అర్హులైన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మక్కువ మండలంలో ఇప్పటివరకు 7,361 మంది అర్హులైన లబ్ధిదారులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. రైతులకు భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడంతో పాటు, భవిష్యత్‌లో భూ వివాదాలు తలెత్తకుండా రికార్డులను క్రమబద్ధీకరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.

రైతులకు భూ హక్కులే అసలైన భరోసా

గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా జరిగిన భూ ఆక్రమణలు, భూ రికార్డుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రస్తుతం రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను రైతులకు అందిస్తున్నామని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. రైతుల భూమి హక్కులకు ఈ పాసుపుస్తకాలు భరోసా కల్పిస్తాయని అన్నారు.“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే” అని మంత్రి పేర్కొన్నారు. రైతుల భూములకు భద్రత కల్పించడమే ప్రభుత్వ విధానమని తెలిపారు.గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన మంత్రి సంధ్యారాణి.. సర్వే రాళ్లపై ఫొటోలు వేసేందుకు సుమారు రూ.700 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని నష్టాల్లోకి నెట్టారని ఆమె విమర్శించారు.

మక్కువ అభివృద్ధికి రూ.100 కోట్లకు పైగా

భూ హక్కుల కార్యక్రమంతో పాటు మక్కువ మండల అభివృద్ధిపై కూడా మంత్రి కీలక ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మక్కువ మండలంలో రూ.100 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.మక్కువ ప్రధాన రహదారులు, కాలువల అభివృద్ధికి రూ.9 కోట్లతో పనులు చేపట్టామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు బైరసాగరం చెరువును అభివృద్ధి చేసి, వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

శంకుస్థాపనలకే పరిమితం కాదు.. పనుల పూర్తే లక్ష్యం

గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలను ఏర్పాటు చేయడంతోనే అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం శంకుస్థాపనలతో ఆగకుండా నిధులు సమకూర్చి, పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు నిర్వహిస్తోందన్నారు.మక్కువ మండలానికి అవసరమైన మౌలిక వసతులు, రహదారులు, సాగునీటి వనరులు, ప్రజా అవసరాలకు సంబంధించిన అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.

“మక్కువ రుణం తీర్చుకుంటా”

తనకు రాజకీయంగా అండగా నిలిచి గెలిపించిన కన్నవారి మండలమైన మక్కువను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని మంత్రి సంధ్యారాణి అన్నారు.ప్రజలు కోరుతున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ మక్కువ మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. రైతుల భూ హక్కుల పరిరక్షణతో పాటు, మౌలిక వసతుల అభివృద్ధి, సాగునీటి వనరుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.“మీ భూమి–మీ హక్కు” కార్యక్రమం ద్వారా రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, భూ రికార్డుల స్పష్టతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న విధానంలో భాగమని అధికారులు తెలిపారు.