మైనార్టీలకు పెద్దపీట వేసాం ....... మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి
బుచ్చిరెడ్డిపాలెం, మేజర్ న్యూస్ : బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా వైసిపి కి చెందిన ప్రస్తుత కౌన్సిలర్ షేక్ షకీలాను ఎంపిక చేసినట్లు మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సోమవారం తెలిపారు. వైసిపి లోనే మైనారిటీలకు సరైన న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు కష్టపడి పనిచేసి షకీలాను చైర్ పర్సన్ గా గెలిపించుకోవాలని ఆయన కోరారు.