BREAKING
ట్రంప్ రష్యన్ డీజిల్ ఒప్పందం చట్టవిరుద్ధం కావొచ్చు...ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ ఇంటెసా టేకోవర్ బిడ్ భేటీకి సిద్ధమైన ‘బంకా మోంటే డీ పాశ్చి’ బోర్డు కంటిచూపు మెరుగుపడటంతో పాటు పొట్ట సమస్యలకు చెక్ పెట్టే గుమ్మడికాయ ఆరోగ్య ప్రయోజనాలు! కరివేపాకుతో నిజంగానే జుట్టు పెరుగుతుందా?.. సోషల్ మీడియా ప్రచారాలు, శాస్త్రీయ వాస్తవాలు ఇవే! ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు....మధ్యేవాద-వామపక్ష అభ్యర్థిగా గ్లక్స్మాన్ విజయం రియాద్ విమానాశ్రయంపై దాడిలో గాయపడిన భారతీయ పౌరుడు మృతి ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం మరియు వాస్తు పరంగా కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే! హోర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా స్పందన సరిపోదు 2016 బ్రెగ్జిట్ ఓటింగ్‌లో రష్యా జోక్యం చేసుకుంది...బ్రిటన్ ప్రధాని బర్హామ్ రామ్ చరణ్ – సుకుమార్ కాంబో ప్రాజెక్ట్‌లో బిగ్ చేంజ్.. మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్ రవిచందర్! పూచీకత్తు బాండ్‌పై దిప్కే సహా ముగ్గురి విడుదలలో సంబరపడాల్సింది ఏమీ లేదు: ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఎద్దేవా! మాస్ పాటలు అంత బాగా రాయగలవనుకోలేదు.. స్టార్ హీరోల ప్రశంసలపై ప్రముఖ గీత రచయిత అనంత శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు! ఒడిశాలో గంజాయి సాగుపై ఉక్కుపాదం: కంధమాల్, బౌద్ జిల్లాల్లో రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB)! ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానని బురిడీ : గుజరాత్ అంబాజీ ఆలయ మోహన్‌థాల్ ప్రసాదానికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్): పవిత్ర నైవేద్యానికి దక్కిన విశిష్ట గౌరవం!

మహిళా మోర్చా సేవలు నిరుపమానం

Select Suryaa Now
మహిళా మోర్చా సేవలు నిరుపమానం


- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
- పర్యావరణ పరిరక్షణలో భాగంగా మోదీ చిత్రంతో వస్త్ర సంచుల విడుదల
నరసన్నపేట పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఆధ్వర్యంలో మోదీ చిత్రంతో రూపొందించిన వస్త్ర సంచులను, స్థానిక కన్వెన్షన్ హాలులో నిర్వహించిన మాజీ వీర జవాన్ల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ కోసం మహిళా మోర్చా చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వస్త్ర సంచుల వినియోగాన్ని ప్రోత్సహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. డాక్టర్ పైడి సింధూర నాయకత్వంలో మహిళా మోర్చా ప్రజల్లో పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు.

డాక్టర్ పైడి సింధూర మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, నేడు సేవ సంకల్ప్ అభియాన్ 25వ రోజు సేవ కార్యక్రమంలో భాగముగా సమాజానికి ఊయాయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్లాస్టిక్ సంచులకు బదులుగా వస్త్ర సంచులను ఉపయోగించడం ద్వారా ప్రకృతిని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పర్యావరణ హితమైన అలవాట్లను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి.వేణుగోపాల్, ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్.ఈశ్వర్, జిల్లా అధ్యక్షులు సిరిపురం.తేజేశ్వరరావు, బిజెపి మహిళా మోర్చ జనరల్ సెక్రటరీ సురవరపు.పద్మ, మాధవి, ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, అప్పలనరసమ్మ, భాను, భవాని, ఇతర సభ్యుల బృందం పాల్గొన్నారు.