మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ కమిషన్ జిల్లా ఇన్చార్జ్ సిద్ధం రెడ్డి నాగేశ్వర్ రెడ్డి ప్రజలందరికీ హృదయపూర్వక గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, మానవతా విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని అన్నారు. ప్రతి వ్యక్తి హక్కులను గౌరవించడం, సమాజంలో సమానత్వాన్ని పెంపొందించడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం, మహిళలు మరియు బాలల రక్షణ, పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రజలతో కలిసి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.
“సత్యం, అహింస, సేవా భావం – సమాజ అభివృద్ధికి మార్గదర్శకం” అనే గాంధీజీ విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు.