గన్నవరం వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి వేడుకలు.
గన్నవరం, అక్టోబర్ 2, మేజర్ న్యూస్.
గన్నవరం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శుక్రవారం మహాత్మా గాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె.వి.ఆర్. కిషోర్ మాట్లాడుతూ దేశానికి గాంధీ, శాస్త్రి చేసిన సేవలను కొనియాడారు. వాకర్స్ అసోసియేషన్ స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి సి.హెచ్. శ్రీనివాసరావు, కోశాధికారి బి. కోటేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు తిరివీధి వెంకయ్య, అదనపు కార్యదర్శి పి.ఎస్.ఎస్.ఎన్. శ్రీనివాస్, సీనియర్ వాకర్స్ కె.ఎన్. బాబురావు, ముక్కామల సుబ్బారావు, చిమట రామారావు, వీసం ప్రసాద్, భౌతిక విద్యా ఉపాధ్యాయుడు ధనియాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.