BREAKING
వరద బాధితులు గూడు కోసం 17 ఏళ్ల నిరీక్షణ..!! పల్లె పండుగతో అభివృద్ధి పరుగులు రెమ్యునరేషన్ కోసమే అయితే ముప్పై, నలభై సినిమాలు చేసేదాన్ని: నటి శ్రీనిధి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు! యూరప్‌పై దాడి చేసే ఉద్దేశం లేదు.. కానీ’: నాటోకు వ్లాదిమిర్ పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం రజినీకాంత్ బయోగ్రఫీలో ఆ స్టార్ హీరో: ఆసక్తికర విషయం వెల్లడించిన సౌందర్య! ఎంపీ అవినాష్‌రెడ్డికి ఈడీ నోటీసులు విభిన్న కథాంశంతో వస్తున్న 'టాల్కమ్ పౌడర్' సినిమా.. నవంబర్ 13న థియేటర్లలోకి! పెన్షన్ లబ్దిదారులలో వెల్లి విరుస్తున్న ఆనందం ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా రివ్యూ.. ఆకట్టుకునేలా ఉందా? వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న డోరతీ సినిమా రివ్యూ.. కీర్తి సురేష్ కీలక పాత్రలో ఎలా ఉందంటే! ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయాణికుడి యత్నం..శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో హై టెన్షన్‌: మంచి వాళ్ళ గుండెల్లో మహాత్ముడు చిరస్మరణీయుడే... గాంధీ మహాత్మునికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు హైదరాబాద్ నగర ప్రయాణికులకు బిగ్ అప్‌డేట్

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

ప్రొద్దుటూరు, అక్టోబర్ 2, మేజర్  న్యూస్:

మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారంప్రొద్దుటూరు  మున్సిపల్ పురపాలక సంఘం కార్యాలయంలో గాంధీజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  మున్సిపలకమిషనర్ తూతిక  శ్రీనివాస్ విశ్వనాథ్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఇటువంటి మహోన్నత వ్యక్తి భారతదేశంలో జన్మించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. బారిస్టర్ ఉద్యోగానికి రాజీనామా చేసి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సత్యం, అహింసా సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకుని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ సాగించిన పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు