BREAKING
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మనుబోలు మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న సైకిల్ స్పీడ్ నెల్లూరులో జోరుగా పోలింగ్.. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలతకు ఇదే నిదర్శనం: వీపీఆర్ దంపతులు అభివృద్ధి సంక్షేమం కోసం టిడిపిని గెలిపించాలి మురసు తుపాను హెచ్చరికల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖ అప్రమత్తం గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తుల గుర్తింపు – మరో ఇద్దరి వద్ద పావు కిలో గంజాయి స్వాధీనం**గంజాయి సేవించిన ఆరుగురిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు – గంజాయి కలిగి ఉన్న ఇద్దరికి రిమాండ్* మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి! మానవత్వం చాటుకున్న మజ్జి సిరి సహస్ర రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం.. సొంత కారులో ఆసుపత్రికి తరలింపు వరకవిపూడిలో వైసీపీ దాదాపు ఖాళీ జర్మనీలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జెన్-జీ నిరసనలు ఓటువేసిన అవనాపు భార్గవి... ఫుడ్ పార్క్ వ్యవహారంలో భారీ కుంభకోణం.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. --రైతులు విలవిలలాడుతుంటే ముఖ్యమంత్రి ఉచిత సలహాలు --బీజేపీ జాతీయ నేత, రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ధ్వజం స్వయం పాలన ఉద్యమ సారథి కుంమ్రం భీం -కొత్తగూడ మండల కేంద్రంలో ఘనంగా 86వ వర్ధంతి వేడుకలు పాచిపెంటలో వైసీపీ భారీ ర్యాలీ .. ఎంపీపీ అభ్యర్థి డోల చిత్తూరు మండలంలో కూటమి ప్రచార హోరు గువ్వకల్లు, పెరుమలకండిగలో ఎంపీపీ అభ్యర్థి జయచంద్ర నాయుడు, జడ్పీటీసీ అభ్యర్థి మంజుల శశికర్ బాబు విస్తృత పర్యటన.

మహాభారత ప్రవచనకర్త కపిలవాయి అచ్యుత రామారావుకు ఘన సన్మానం ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఆలయ కమిటీ, భజన బృందం ఆధ్వర్యంలో సత్కారం

Select Suryaa Now
మహాభారత ప్రవచనకర్త కపిలవాయి అచ్యుత రామారావుకు ఘన సన్మానం  ఆధ్యాత్మిక సేవలకు గుర్తింపుగా ఆలయ కమిటీ, భజన బృందం ఆధ్వర్యంలో సత్కారం

టి.నరసాపురం, మేజర్ న్యూస్:గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందిస్తూ మహాభారతంలోని ధర్మసూక్ష్మాలను ప్రజలకు వివరిస్తూ ప్రవచనాలు అందించిన ప్రముఖ ప్రవచనకర్త శ్రీ కపిలవాయి అచ్యుత రామారావుకు ఘనంగా సన్మానం నిర్వహించారు.అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించిన మహాభారత ప్రవచన కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా శ్రీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థాన ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, భజన బృందం ఆధ్వర్యంలో అచ్యుత రామారావును ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.ఈ సందర్భంగా అచ్యుత రామారావు మాట్లాడుతూ.. మహాభారతం కేవలం ఒక ఇతిహాసం మాత్రమే కాదని, మానవ జీవితానికి మార్గదర్శకమైన గొప్ప ధర్మగ్రంథమని అన్నారు. ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి సంఘటన మనిషికి ఎన్నో జీవిత పాఠాలను నేర్పుతుందని తెలిపారు. ధర్మం, సత్యం, న్యాయం, కుటుంబ విలువలు, మానవ సంబంధాల ప్రాధాన్యతను మహాభారతం ద్వారా తెలుసుకోవచ్చన్నారు.

తనకు ఈ గ్రామంలో మహాభారత ప్రవచనాలు అందించే అవకాశం కల్పించిన ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులకు, భజన బృందానికి, కార్యక్రమానికి సహకరించిన గ్రామ పెద్దలకు, భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, భజన బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

 పసుమర్తి రాము జిల్లా ఇంచార్జ్ ఏలూరు