మాతృభూమి సేవా సంఘం జిల్లా అధ్యక్షులుగా: సత్తారు రాజశేఖర్
టెక్కలి, సూర్య : మాతృభూమి సేవా సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గా నియమితులైన సత్తారు రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు టెక్కలి లో బుధవారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఇంచార్జ్ పొట్నూరు ప్రతాప్ పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు పొన్నాడ కనకచారితో చర్చించి టెక్కలి ప్రాంతానికి చెందిన సామజిక కార్యకర్త రాష్ట్ర గ్రామీణ వైద్యులు సంఘం నాయుకులు సత్తారు రాజశేఖర్ ని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు గా నియమిస్తూన్నట్లు మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఐ. గోపాలరావు తెలిపారు ఈ సందర్బంగా శ్రీకాకుళం జిల్లా మాతృభూమి సేవా సంఘం అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమలు చేస్తూ ప్రజలు మన్ననలు పొందిన మాతృభూమి సేవా సంఘం నా మీదా నమ్మకంతో శ్రీకాకుళం జిల్లా సంఘం అధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంఘం నామీద పెట్టిన నమ్మకం మేరకు రాజకీయాలకు, కులాలు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కష్టం అని మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సహాయం అందిస్తాం అన్ని అన్నారు.
రిపోర్టర్ : రాంజీ, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా.