BREAKING
నేడు పలు కార్యక్రమాలలో పాల్గొననున్న గొట్టిపాటి లక్ష్మి మొదటి నెల జీతంతో వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ సర్వే పనుల పురోగతిని వేగవంతం చేయాలి* విద్యతో పాటు సేవలోనూ ఆదర్శం. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి ఘన సన్మానం. శానిటేషన్‌ వర్కర్లకు వైద్య పరీక్షలు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణ జరిపి గిరిజనులకు న్యాయం చేయాలి: జీవీఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధనుంజయ నాయక్ పంబలేరు వంతెన రహదారి పనుల పరిశీలన పశుపోషణతో రైతులకు లాభదాయకం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:33 గంటలకు పొట్టేపాలెం కలుజు ప్రారంభోత్సవం మైన్లలో అధికారుల తనిఖీలు వివరాలు గోప్యం అరసవల్లి అభివృద్ధికి నిధుల విడుదలపై ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం.. జై భీమ్ నగర్ గిరిజన కాలనీలో వైద్య విబిరం కనువిందు చేసిన 150 జతల ఒంగోలు గిత్తలు! జీవో నెంబర్ 6 ను తక్షణమే అమలు చేయాలి వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

మాకవరపాలెం మండలానికి రూ.10.10 కోట్ల నిధులు : స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు

Select Suryaa Now
మాకవరపాలెం మండలానికి రూ.10.10 కోట్ల నిధులు : స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు


మాకవరపాలెం,సెప్టెంబర్ 30,మేజర్ న్యూస్:

గ్రామాల సర్వాంగీణ అభివృద్ధే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. పల్లె పండుగ–3.0 కార్యక్రమంలో భాగంగా బుధవారం మాకవరపాలెం మండలం శెట్టిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వికసిత్‌ భారత్‌–ఉపాధి హామీ, జీవనోపాధి గ్రామీణ పథకం కింద రాష్ట్రానికి రూ.11,085 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.5,391 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,694 కోట్లు కేటాయించిందన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 421 అభివృద్ధి పనులకు రూ.43.59 కోట్ల నిధులు కేటాయించినట్లు తెలిపారు. మాకవరపాలెం మండలంలో 76 పనులకు రూ.10.10 కోట్లు, నాతవరం మండలంలో 148 పనులకు రూ.21.86 కోట్లు, నర్సీపట్నం మండలంలో 104 పనులకు రూ.5.38 కోట్లు, గొలుగొండ మండలంలో 93 పనులకు రూ.6.26 కోట్లు కేటాయించినట్లు వివరించారు. గతంలో మాకవరపాలెం మండలానికి మంజూరైన రూ.114 కోట్లతో కలిపి మొత్తం రూ.124 కోట్ల అభివృద్ధి నిధులు అందుతున్నాయని చెప్పారు. అదనంగా ప్రాంతీయ ఉపాధి ప్రోత్సాహకం కింద రూ.10 కోట్లతో కాఫీ ప్రాసెసింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. శెట్టిపాలెం పంచాయతీ అభివృద్ధికి ఇప్పటివరకు రూ.3.52 కోట్ల విలువైన పనులు మంజూరు చేసినట్లు స్పీకర్ తెలిపారు. మొదట 12 పనులకు రూ.2.12 కోట్లు, తాజాగా రెండు కొత్త రోడ్లకు రూ.40 లక్షలు, రామాలయ నిర్మాణానికి రూ.1 కోటి కేటాయించినట్లు వెల్లడించారు. గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి సూర్యచంద్ర, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్‌.వై. పాత్రుడు, అల్లు నాయుడు, నందకిషోర్‌, తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.