BREAKING
జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్! ట్యాంకర్ల ద్వారా నీటి వృథాను అరికట్టేందుకు కఠిన చర్యలు : నవంబర్ 1 నుంచి నిబంధనల ఉల్లంఘనకు రూ.5 వేల జరిమానా

కువైట్ లో ఇబ్బంది పెడుతున్న మహిళను సురక్షితంగా స్వదేశానికి..

Select Suryaa Now
కువైట్ లో  ఇబ్బంది పెడుతున్న  మహిళను సురక్షితంగా స్వదేశానికి..

అమలాపురం మేజర్ న్యూస్ ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన ఎం. పుష్ప కువైట్ దేశంలో తీవ్ర 
కువైట్ లో రెండేళ్లు గడువు పూర్తయిన ఇంటికి పంపకుండా ఇబ్బంది పెడుతున్న  మహిళను సురక్షితంగా స్వదేశానికి రప్పించిన మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన ఎం. పుష్ప కువైట్ దేశంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశాల మేరకు జిల్లా, మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆమెను సురక్షితంగా భారతదేశానికి రప్పించారు.
కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా పద్మ 2024  జులై నెలలో  ఉపాధి నిమిత్తం కువైట్  వెళ్లారు. అక్కడ ఒక కుటుంబంలో గృహ కార్మికురాలిగా పనికి చేరిన ఆమె తీవ్రమైన పని ఒత్తిడి వున్నా ఆమె రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, అయినా మరొక సంవత్సరం చెయ్యాలి అని ఆమె పై ఒత్తిడి తీసుకుని రావడం తో ఆమె తండ్రి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదును మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్‌కు అందజేయగా, జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టి పుష్ప  ను సురక్షితంగా భారతదేశానికి రప్పించినట్లు మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ సమన్వయకర్త గోళ్ళ రమేష్ తెలిపారు.
భారతదేశానికి చేరుకున్న అనంతరం పుష్ప తన భర్తతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి మరియు మైగ్రేషన్ మేనేజ్మెంట్ సెంటర్ నోడల్ అధికారి వీర్ల సుబ్బారావును కలిశారు. తమకు అండగా నిలిచి స్వదేశానికి సురక్షితంగా చేరుకునేందుకు సహకరించిన జిల్లా కలెక్టర్  వారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కడియాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.