andhrapradesh
క్రీడాకారులకు విక్కుర్తి చేయూత
క్రీడాకారులకు విక్కుర్తి చేయూత
అవనిగడ్డ, మేజర్ న్యూస్: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విక్కుర్తి శ్రీనివాసరావు ఆర్థిక సహాయం అందించారు. గురువారం తన కార్యాలయంలో క్రీడాకారులను అభినందించిన ఆయన, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి అవనిగడ్డ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఉమ్మడి కృష్ణాజిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-18 సెలక్షన్స్‌లో నాగాయలంక మండలంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పలువురు ఎంపికయ్యారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో కడప జిల్లా పుల్లంపేటలో జరగనున్న 12వ జూనియర్ రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో వారు పాల్గొననున్నారు. క్రీడాకారుల ప్రయాణం, ఇతర అవసరాల కోసం విక్కుర్తి ఆర్థిక సహాయం అందించారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా