కొరసవాడ అరుణోదయ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం.
పాతపట్నం అక్టోబర్ 2,మేజర్ న్యూస్:
జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో సత్తా చాటిన వైనం
శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలో 2026 అక్టోబర్ 2వ తేదీన వేదం ఇంటర్నేషనల్ ఏఐ అకాడమీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన జిల్లా స్థాయి క్విజ్ పోటీలలో కొరసవాడలోని అరుణోదయ స్కూల్ విద్యార్థులు అపూర్వ ప్రతిభను కనబరిచి అసాధారణ విజయాలను నమోదు చేస్తూ పోటీలన్నింటిలోనూ తమ ప్రభంజనాన్ని సృష్టించారు ఈ జిల్లా స్థాయి మేధోపరమైన పోటీలలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా పాల్గొని తమ విజ్ఞానాన్ని చాటుకోగా అరుణోదయ స్కూల్ విద్యార్థులు మాత్రం ఏకంగా నాలుగు ప్రధాన స్థానాలను కైవసం చేసుకుని పాఠశాలకీ తమ తల్లిదండ్రులకీ మరియు శ్రీకాకుళం జిల్లా విద్యా రంగానికి అత్యంత గర్వకారణంగా నిలిచారు పోటీల నిర్వహణ చాలా హోరాహోరీగా సాగినప్పటికీ మన విద్యార్థులు ఎక్కడా తడబడకుండా అన్ని ప్రశ్నలకు సమయస్ఫూర్తితో సమాధానాలు ఇస్తూ అందరి ప్రశంసలను అందుకున్నారు ఈ పోటీల ఫలితాల అధికారిక వివరాల ప్రకారం ఆరవ తరగతి అభ్యసిస్తున్న ప్రశాంత్ సాహూ అత్యుత్తమ ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా అదే తరగతికి చెందిన సవిరిగాన సౌజన్య కుమార్ తన చురుకైన సమాధానాలతో ద్వితీయ స్థానాన్ని విజయవంతంగా సాధించారు అలాగే తొమ్మిదవ తరగతి విద్యార్థి అయిన చౌదరి హేమంత్ అత్యంత పోటీ మధ్య జరిగిన రౌండ్లలో తృతీయ స్థానాన్ని దక్కించుకోగా ఎనిమిదవ తరగతి విద్యార్థి ఇల్లా హేమంత సాయి ప్రతిభావంతుడిగా నిలిచి కన్సోలేషన్ బహుమతిని గెలుచుకుని న్యాయనిర్ణేతల నుంచి ప్రత్యేక అభినందనలు అందుకున్నారు జిల్లా స్థాయిలో ఈ స్థాయి విజయం సాధించడం మామూలు విషయం కాదని ఇంతటి గొప్ప ఫలితాలు రావడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ జి విజయ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆనందం వ్యక్తం చేస్తూ విజేతలైన విద్యార్థులను ఘనంగా అభినందించారు కేవలం విద్యార్థుల కష్టమే కాకుండా వారి వెనుక ఉండి ప్రతి అంశాన్ని శ్రద్ధగా నేర్పించి జిల్లా స్థాయిలో విజయం సాధించుటకు అంకితభావంతో శ్రమించిన పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ఇతర సిబ్బందిని మరియు పిల్లలను ఎప్పుడూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ మరియు తోటి ఉపాధ్యాయులు ఎంతగానో కొనియాడారు విద్యార్థులు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో ఉన్నతమైన పోటీలలో పాల్గొని మరిన్ని విజయాలను సాధించి పాఠశాల పేరును జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో నిలపాలని ఆకాంక్షించారు ఈ విధంగా అరుణోదయ స్కూల్ విద్యార్థులు సాధించిన ఈ ఘనవిజయం ప్రస్తుతం జిల్లా విద్యావర్గాలలోనూ స్థానికంగానూ హాట్ టాపిక్ గా మారి అందరిచేతా శభాష్ అనిపించుకుంటోంది.