BREAKING
దీపావళి జ్ఞాన జ్యోతి వెలుగులు ప్రతి ఇంట్లో వెలగాలి అనే ఉద్దేశం తో త్రైత సిద్ధాంత భగవద్గీత ప్రచారం. కిష్త్వార్‌లో అత్యాధునిక భూకంప పరిశీలన కేంద్రం ప్రారంభం నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే అమిలినేని. ప్లేట్‌లెట్ మార్పులతో ముందస్తు గుర్తింపు సాధ్యమని వెల్లడించిన పరిశోధన నేల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఖేత్ బచావో అభియాన్' ‘సమ్మర్ హాలిడేస్’ పిల్లలు నటించిన పెద్దల సినిమా: దర్శకుడు శ్రీకర్ నయన్ ఆసక్తికర విశేషాలు! మురాసు తుపానుపై అప్రమత్తం.. ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్ తుగ్గలి మండలంలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం హోరు* *టిడిపి - బిజెపి పార్టీలు మధ్య సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి ప్రజావాణికి 57 వినతులు -ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: -జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అక్టోబర్‌లో 54.7కి పడిపోయిన పీఎంఐ సూచీ.. ఎగుమతుల్లో మాత్రం రికార్డు జోరు కూటమి లో లొల్లి... పేరూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక!! ఓట్ల లెక్కింపు నకు ఏర్పాట్లు పూర్తి ఆంధ్రప్రదేశ్‌కు సహాయంగా 500 మంది విద్యుత్ సిబ్బందిని, పరికరాలను పంపిన తమిళనాడు ప్రభుత్వం

కూటమి ప్రభుత్వంపై మార్గాన్ని ఆగ్రహం

Select Suryaa Now
కూటమి ప్రభుత్వంపై మార్గాన్ని ఆగ్రహం

నేటి దినపత్రిక సూర్య న్యూరో రాజమహేంద్రవరం : కడప జిల్లా పులివెందుల స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని, రాష్ట్రంలో ఇంత దారుణంగా ఎన్నికలు జరగడం ఎప్ప్పుడూ ఆంధ్రప్రదేశ్‌లో చూడలేదని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైసిపి జాతీయ అధికార ప్రతినిది, సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ఆదివారం జరిగిన పోలింగ్ అక్రమాలను చూపించిన జాతీయ మీడియాను సైతం టిడిపి గూండాలు రాళ్లు కర్రలతో కొట్టారని, గతంలో ఈవీఎం లతో గెలిచారు... ఇప్పుడు దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. స్థానిక విఎల్ పురం మార్గాని ఎస్టేట్స్‌లో ఉన్న వైసిపి సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భరత్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై సైతం పిడి గుద్దులు కురిపించారని ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోడ్డుపై బైఠాయించి ఎన్నికల్లో జరుగుతున్న అకృత్యాల గురించి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేసారు. ఇంత దారుణాలు, అక్రమాలు జరుగుతున్నా ఎస్ఇసి ఏం చేస్తుందని నిలదీసారు. రాప్తాడులో పదో తరగతి చదువుతున్న బాలిక చేతిని రంపంతో కోసేసారని ఇంత పెద్ద ఘటన జరిగినా జాతీయ మీడియాలో రాకపోవటం దారుణమన్నారు. చంద్రబాబు మీడియా మేనేజ్మెంట్ చేసి ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చేయాలని కుట్ర చేసారని ఆరోపించారు. ఈ ఘటనలో నిందితులపై కాల్పులు జరిపి ఎన్‌కౌంటర్ చేయడానికి ప్రయత్నించారని, అయితే డాక్టర్ ప్రియాంకను రాజమండ్రి నగరంలో దారుణంగా కారుతో తలపై ఎక్కించి గుద్ది చంపేస్తే మÖడు రోజుల వరకు ఎందుకు ఘటనను బయటకు రానివ్వకుండా చేసారని ప్రశ్నించారు. ఈ ఘటన వెనుక టీడీపీ నాయకులు ఉన్నారు కాబట్టే నిందితులను కూడా సైతం కాపాడే ప్రయత్నం చేసారని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి ఒక న్యాయం.. డాక్టర్ ప్రియాంకకు మరొక న్యాయం ఎంతవరకు సమంజసమని, ఈ కేసులో నిందితులపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. హింసను ప్రేరేపించడం తమ ఉద్దేశ్యం కాదని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నదే ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో తీవ్రంగా స్పందించిన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఆ కేసులో నిందితులపై ఈ తరహా చర్యలు ఎందుకు తీసుకొలేదో చెప్పాలని డిమాండ్ చేసారు. తనకు హోంశాఖ ఇస్తే తడాఖా చూపిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు కదా.. డాక్టర్ ప్రియాంక ఘటనలో పవన్ కళ్యాణ్ ఎందుకు తఢాఖా చూపించలేదని నిలదీసారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల రిజర్వేషన్ వివరాలు.. స్థానిక ఎమ్మెల్యేగా ముందుగానే ఎలా తెలిసిపోయాయని, రిజర్వేషన్ వివరాలు వాట్సప్ గ్రూపుల్లో అధికారుల ప్రకటన కంటే ముందుగా ఎలా చక్కర్లు కొట్టాయని నిలదీసారు. రిజర్వేషన్లు మున్సిపల్ కమిషనర్ చేశారా. స్థానిక ఎమ్మెల్యే చేశారా.... స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేసారు. పరిస్థితులు ఇలా ఉంటే రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఫెయిర్ గా.... ట్రాన్స్పరెంట్‌గా ఎలా జరుగుతాయో ఎన్నికల కమీషన్ ఆలోచన చేయాలన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో  వైసిపి నుంచి 72 డివిజన్ల లో  నికార్సైన అభ్యర్థులను నిలబెడతామని స్పష్టం చేసారు. సిఈసీ జ్ఞానేశ్వర్ ను ప్రధాన ఎన్నికల కమిషనర్ గా తొలగించాలని, ఇంత జరుగుతున్నా సిఈసి రాజీనామా చేయకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం సిఈసీ ని ఇంత  వేసుకుని రావాల్సిన అవసరం లేదన్నారు. అన్యాయంగా, కుట్ర పూరితంగా ఓట్లను తొలగిస్తుంటే ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ దక్కుతుందని ప్రశ్నించారు. 

----