కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి మా విజయానికి కారణం. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్:
ఆళ్లగడ్డ మున్సిపాలిటీని అధికార కూటమి దక్కించుకోవడం ప్రజా విజయమని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం ఆళ్లగడ్డలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికార కూటమి 24 వైకాపా 8 వార్డులను ఏకగ్రీవంగా దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. మేము చేసిన అభివృద్ధి మా విజయానికి కారణమన్నారు. 2024 ఎన్నికల్లో ఆళ్లగడ్డ మున్సిపాలిటీ లో 5 ,000 ఓట్లమెజారిటీ తమకు దక్కడం జరిగిందన్నారు. నాడు ప్రజలు ఇచ్చిన విజయాన్ని తాను బాధ్యతగా స్వీకరించానన్నారు.మేము చేసిన అభివృద్ధితోనే మాకు ఈ విజయం దక్కడం జరిగిందన్నారు. ఈ విజయంతో మాకు మరింత బాధ్యత పెరిగింది అన్నారు.