కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి తథ్యం
ఇరగవరం మేజర్ న్యూస్:కూటమి ప్రభుత్వం బలపరిచిన బిజెపి జడ్పిటిసి అభ్యర్థి పంపన మహాలక్ష్మి మరియు రేలంగి ఒకటవ ఎంపీటీసీ జనసేన అభ్యర్థి కాసాని వెంకన్న బాబు,రెండవ ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి కామన కృష్ణ పావని,మూడవ ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి సభ్యురాలు చీలి సత్యశ్రీ లను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని మాజీ జడ్పీటీసీ సభ్యులు,జిల్లా ఎస్.సి సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు కోరారు. ఆదివారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను(ఓటర్లును) కూటమి నాయకులు ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు.జెడ్పీ నిధులతో పాటు స్థానిక ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ సహాయ సహకారంతో ఇరగవరం మండలాన్ని అని విధాల అభివృద్ధి చేసారని చుక్కా సాయిబాబు అన్నారు. ప్రజలకు కరపత్రాలు అందించి ఓట్లు కమలానికి, సైకిల్ కి, గాజు గ్లాస్ కి వేయాలని కోరరు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులు కామన రాంబాబు,సెక్రెటరీ జట్టు బోయిన నాగేశ్వరరావు,కూటమి నాయకులు గూడూరి నాగరాజు,కామన ఏడుకొండలు,అడ్డాల మెంటారావు,కాసగాని రామకృష్ణ,మంగిన శ్రీనువాసు,యర్రంశెట్టి సత్యనారాయణ,చీలి అశోక్,కామన అంజి,మల్లిపూడి శివ,గుడాల శ్రీనివాస్,మామిడి చెట్టు సత్యనారాయణ,పాతూరి వెంకట్రావు,దాకే నాగేశ్వరరావు,కనకయ్య, షేక్ బాషా,ఏకుల అప్పారావు,మస్తాన్ మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.