కోనేటిపురం గ్రామంలో ప్రచారంలో పాల్గొన్న టిడిపి శ్రేణులు
భట్టిప్రోలు, మేజర్ న్యూస్: భట్టిప్రోలు మండలం కోనేటి పురం- ఆళ్ళముడి పంచాయితీ ల పరిధిలోని కూటమి పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి జల్లి రత్నకుమారి, మండల జడ్పిటిసి అభ్యర్థి నక్క శ్రీనివాసరావు ల గెలుపు కొరకు రెండు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కోనేటిపురము, ఆళ్లముడి, పడమటి పాలెం గ్రామాల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు వాకా శేషుబాబు,వేమూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రాజులపాటి వెంకటేశ్వరరావు, గ్రామ మాజీ సర్పంచ్ జల్లి కుటుంబరావు, మాజీ ఎంపీటీసీ జంపని శ్రీనివాసరావు, సూరేపల్లి సొసైటీ డైరెక్టర్ తాతా పోతురాజు, సాగునీటి సంఘం డైరెక్టర్ పడమటి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు పడమటి ఏడుకొండలు, జంపని అంకినీడి వరప్రసాద్, కారంకి శ్రీనివాసరావు, చెంచు రంగారావు, పడమటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.