BREAKING
నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసనలు బంగారు బందరుగా మచిలీపట్నం తీర్చిదిద్దుతాం

కోడూరులో ఏకగ్రీవంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు

Select Suryaa Now
కోడూరులో ఏకగ్రీవంగా ఎస్‌ఎంసీ ఎన్నికలు


బాడంగి, సెప్టెంబర్ 29 (మేజర్ న్యూస్): కోడూరు గ్రామంలోని హైస్కూల్‌, ఎంపీపీ పాఠశాలలకు సంబంధించిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో ఏకగ్రీవంగా జరిగాయి. రాష్ట్ర కొప్పువెలమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కొల్లి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. ఎలాంటి వివాదాలు, అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సభ్యుల ఏకాభిప్రాయంతో నూతన కమిటీలను ఎన్నుకున్నారు.కోడూరు హైస్కూల్‌ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా కొల్లి రామలక్ష్మి, వైస్‌ చైర్మన్‌గా వాండ్రాసి పోలినాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా తియ్యాల పకీరు, వైస్‌ చైర్మన్‌గా జామి ఈశ్వరమ్మను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన విద్యా వసతుల కల్పన, పాఠశాలల్లో నాణ్యమైన విద్యా వాతావరణం ఏర్పాటుకు నూతన ఎస్‌ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు సమన్వయంతో ముందుకు సాగాలని కొల్లి అప్పలనాయుడు తోపాటు పలువురు గ్రామ పెద్దలు  ఆకాంక్షించారు. ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, సభ్యులకు అభినందనలు తెలిపారు.కార్యక్రమంలో కొల్లి సత్యారావు, మరిపి రమేష్‌, కొల్లి చిన్నం నాయుడు, మరిపి అప్పలనాయుడు, కొల్లి అప్పలనాయుడు (ఎల్‌ఐసీ), భోగి సురేష్‌, కొల్లి తిరుపతి, అల్జింగ్‌ పుష్పనాదం, రెడ్డి రాజారావు, అడ్డా వెంకటరమణ, కొల్లి శ్రీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.