కాంగ్రెస్ పార్టీకి మేయర్ అభ్యర్థిగా చిత్తూరు శివశంకర్ నామినేషన్.
తిరుపతి రెవెన్యూ మేజర్ న్యూస్.
కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు చిత్తూరు శివశంకర్ నామినేషన్ దాఖలు
తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తాం
కాంగ్రెస్ నేతల ధీమా
ఇండియన్ కాంగ్రెస్ తరపున తిరుపతి కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు అయిన చిత్తూరు శివశంకర్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి, తిరుపతి నగర మాజీ అధ్యక్షుడు యార్లపల్లి గోపితో కలిసి నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి పార్టీ బీఫామ్ తో చిత్తూరు శివశంకర్ నామినేషన్ అందజేశారు. ఈ సందర్భంగా చిత్తూరు శివశంకర్ మాట్లాడుతూ తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని పేద, బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఒక్కటే న్యాయం చేయగలదని అన్నారు. తిరుపతి నగర ప్రజలు తమ అమూల్యమైన ఓటును తనకు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని వివరించారు. ప్రజలు ఇప్పటివరకు టిడిపి, వైసిపి పార్టీలకే అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థుల విజయం ప్రజా విజయమన్నారు.
కె రాజేష్ రిపోర్టర్ తిరుపతి