కలిగిరి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు 8 నామినేషన్ పత్రాల స్వీకరణ
కలిగిరి, మేజర్ న్యూస్ : కలిగిరి మండలంలో ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి మొత్తం 8 నామినేషన్ పత్రాలను స్వీకరించినట్లు ఎన్నికల అధికారి సి. శివప్రసాద్ తెలిపారు. మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు వెల్లడించారు.వివరాల్లోకి వెళ్తే.. చిన్న అన్నలూరు పంచాయతీ పరిధి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా ఏలూరి నాగేశ్వరరావు, తలపల రమణయ్య ఒక్కొక్క నామినేషన్ పత్రం చొప్పున దాఖలు చేశారు. కలిగిరి బిట్-1 నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పైడి కోటమ్మ ఒక నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.
గంగిరెడ్డిపాలెం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా మూలే నారాయణమ్మ, మూలే జయమ్మ ఒక్కొక్క నామినేషన్ పత్రం చొప్పున దాఖలు చేయగా, టీడీపీ అభ్యర్థిగా పోలు ఆదిలక్ష్మమ్మ ఒక నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.అలాగే, కలిగిరి బిట్-2 నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పాలూరి కొండారెడ్డి, ఆవుల ప్రభాకర్‌రెడ్డి ఒక్కొక్క నామినేషన్ పత్రం చొప్పున దాఖలు చేశారు.ఈ విధంగా మండలవ్యాప్తంగా ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 8 నామినేషన్ పత్రాలు స్వీకరించినట్లు ఎన్నికల అధికారి సి. శివప్రసాద్, సహాయ నిర్వహణ అధికారిణి కే. ప్రత్యూష తెలిపారు.స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ సందడి నెలకొంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన తదితర కార్యక్రమాలు కొనసాగనున్నాయి.